Posts

Kodavantimata

Image
కొంగు బంగారమౌ కొడవంటి మాట (వేదాంతం) http://vedantam7.blogspot.in/ ఓం రామలాల్ ప్రభు సమారంభాం నారాయణ ప్రభు మధ్యమాం అస్మాదాచార్య పర్యంతామ్ వందే గురు పరంపరామ్ 1.ఈశ్వరుండు గలడు ఈ శరీరమునందు - దిశ మారినను చాలు దైవ దర్శనమ్మగును కక్ష్య మారినయట్లు గ్రహము గ్రహమునకు - కొంగు బంగారమౌ కొడవంటి మాట 2.తోలు కనులకు దైవ దర్శనము దుర్లభము - కోలుకొని మనసు మరుగు పడిన చాలు కల్గు మూడవ కన్ను కనుబొమల నడుమ - కొంగు బంగారమౌ కొడవంటి మాట 3. జలము కలుషితమైన కనజాలమేమియు - జలము నిర్మలమైన నిజము తెలియు మనసు నిర్మలమైన నిజరూపదర్శనమె - కొంగు బంగారమౌ కొడవంటి మాట 4. మనుషుల మనసు మారుట సహజమ్ము - మనసు మధియింప మహనీయుడగును మనలోని మహనీయుడాదేవదేవుడే - కొంగు బంగారమౌ కొడవంటి మాట 5. జిడ్డు కృష్ణమూర్తి జగతిలో వేదాంతి - జిడ్డు వదిలించుకొని జితేంద్రియుడయ్యె జడ్డి తనము వీడ జయము తధ్యము సుమ్మి - కొంగు బంగారమౌ కొడవంటి మాట 6. నేను ఎవరొ తెలియమన్నారు రమణులు-నేను నీవు ఒకటె శరీరము వేరు    లోని గుట్టు తెలియ లోకమ్మె తెలియును - కొంగు బంగారమౌ కొడవంటి మాట 7. శాంతి మార్గమె ముద్దు యుద్ధమసలే వద్దు - శాంతి దూతవు న...